- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ దేవుడు రాముడు కాదు ఒవైసీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎంఐంను బూతంగా చూపించి ఓట్లు దండుకోవాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను బీజేపీ ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు కేటాయించిన సెమీ కండక్టర్ ప్రాజెక్టును చివరి నిమిషంలో మోడీ ఒత్తిడితో ఏపీకి తరలించారని, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్ కు తీసుకెళ్లారన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈ 12 ఏళ్లలో రాజ్యాంగ బద్ధంగా వచ్చే నిధులు కాకుండా తెలంగాణకు ప్రత్యేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏమైనా తెచ్చారు? అని నిలదీశారు. తెలంగాణలు లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని బీజేపీ నేతల ప్రకటనపై అధికారులను అడిగితే తెలంగాణ నుంచి రూపాయి పన్నురూపంలో చెల్లిస్తే కేంద్రం నుంచి మనకు తిరిగి వస్తున్నది కేవలం 42 పైసలు మాత్రమే నన్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అదే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా నిధులు ఇస్తోందని దుయ్యబట్టారు. స్పెషల్ నిధులు తేస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ బాధ్యత ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ దేవుడు ఒవైసీ:
బీజేపీ నాయకులకు అసదుద్దీన్ ఒవైసీ దేవుడు అని వీళ్లంతా పైకి రాముడి పేరు చెబుతారు కానీ రోజు దండం పెట్టుకునేది మాత్రం ఒవైసీకి అన్నారు. రాముడి పేరు ఎన్ని సార్లు తలుచుకున్నారో తెలియదు కాని ఒవైసీ పేరు తలుచుకోకుండా రోజు వీళ్లకు రోజు గడవదన్నారు. వీళ్ల లైఫ్ లైనే ఎంఐఎం అన్నారు. అన్ని మీ చేతుల్లో ఉన్నప్పుడు ఒవైసీని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ దేశంలో మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే ఎంఐఎం కూడా ఓ రాజకీయ సంస్థ. ఇంకెంత కాలం ఆ పార్టీని బూతంగా చూపించి ఓట్లు అడుగుతారని నిలతీశారు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి, కొంత మంది రాజకీయ నాయకులను బూతంగా చూపిస్తూ రాజకీయ మనుగడ సాగించాలనేది వారి భావదారిద్ర్యానికి పరాకాష్ట అన్నారు. ఈ భావదారిద్య్రాన్ని చూసి బీజేపీకి ఓట్లు వేయాలా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.






