- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy Venkatareddy : బీజేపీ కలలు ఫలించవు : మంత్రి కోమటిరెడ్డి
మరోసారి బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venakatareddy).

దిశ, వెబ్ డెస్క్ : మరోసారి బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venakatareddy). రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతోందని, ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలు కూడా ఎన్నటికీ ఫలించవని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అని, నిరుపేదల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ మాత్రమే తెచ్చిన ప్రభుత్వ పథకం అని కొనియాడారు. సన్నబియ్యం పథకంలో తమ వాటా ఉందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. రూ.500కే గ్యాస్, సన్నబియ్యం దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు.
నిరుద్యోగ యువత కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం(Rajeev Yuva Vikasam) పథకం గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించామని, అర్హులైన వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పదేళ్లు అధికారంలో ఉండి ఫామ్‌హౌస్‌లో పడుకున్నవాళ్లు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.






