- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో బీజేపీ నిర్ణయం రాజకీయ స్వార్థమే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం సీఎల్పీ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ బీసీల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. దేశంలో పేదల కోసం పథకాలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేసి లెక్కలు తేల్చారని, తెలంగాణలో బీసీలు 56. 36 శాతం ఉన్నారని , వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణలో కుల గణన విజయవంతం కావడంతో కేంద్రంలోని బీజేపీ కళ్లు తెరిచిందన్నారు. కులగణన పేరుతో బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. బీజేపీ నిర్ణయంలో రాజకీయ స్వార్థం కనిపిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అయినప్పటికి కూడా తాము వారిని స్వాగతిస్తున్నామన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానిది కుల సర్వే, మాది కులగణన అంటున్నారని, కుల సర్వే కి, కుల గణన కు తేడా ఏమిటో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడని, కుల సర్వే చేసినా, కుల గణన చేసినా వ్యక్తుల కులం మారుతుందా..? అని ఆయన ప్రశ్నించారు. కుల గణన పైన బీజేపీ ఎన్ని సమావేశాలు పెట్టిన ప్రయోజనం ఉండదన్నారు. కులగణన కు పునాది రాయి వేసిందే కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు నన్నారు. బీసీ పట్ల బీజేపీ కి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ ల కోసం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ లో దీక్ష చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు హాజరు కాలేదు..? గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం లను బీసీల్లో చేర్చారు.. దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
బీఆర్ఎస్ లో బావ, బామ్మర్ది మధ్య చాలా కాలంగా పంచాయతీ ఉందని, కుర్చీ కోసం హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ బావ, బామ్మర్ది గొడవతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. అది వారి అంతర్గత విషయం అని, అయితే ఇందులో హరీష్ రావు ట్రబుల్ షూటర్ అయితే కేటీఆర్ ఎందుకు అన్ ఫాలో చేశారు..? వైఎస్ హయాంలో హరీష్ రావు కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నం చేశారు.. కాంగ్రెస్ లో ఎవరైనా చేరవచ్చని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో కొత్త పార్టీకి కావాల్సిన స్పేస్ లేదు అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్, ఎర్రబెల్లి మాత్రమే మాట్లాడారన్నారు. వారి సామాజిక న్యాయం ఏమిటో దానితోనే తేలిపోయిందన్నారు. సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
- Tags
- Adi Srinivas






