కాంగ్రెస్ MLA సొంతూరులో బీజేపీ గెలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-11 12:27:09  IST  )

కాంగ్రెస్ MLA సొంతూరులో బీజేపీ గెలుపు

కాంగ్రెస్ MLA సొంతూరులో బీజేపీ గెలుపు
X

దిశ,జడ్చర్ల/వెబ్‌డెస్క్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది. గ్రామంలో ఉన్న మొత్తం ఓట్లలో 972 ఓట్లు పోలు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతికి 490 ఓట్లు వచ్చాయి. మొదట బీజేపీ అభ్యర్థి రేవతి ఆరు ఓట్ల మెజారిటీ సాధించగా.. అధికార పార్టీ నాయకులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. రేవతికి రీకౌంటింగ్‌లో మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. కాగా అనిరుద్ రెడ్డి సొంత మండలం రాజాపూర్‌లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎఎస్ గెలుచుకుంటుందని కౌంటింగ్ సరళి వల్ల తెలుస్తోంది. ఎమ్మెల్యే సొంత మండలం. సొంత ఊరులో వ్యతిరేక ఫలితాలు వస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.




Next Story