- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ఏం ఒరగబెట్టారని బీజేపీని గెలిపిస్తారు: ఆది శ్రీనివాస్
తెలంగాణ పర్యటన వేళ ప్రధాని మోడీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 10 ప్రశ్నలు సంధించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణకు ఏం ఒరగబెట్టారని బీజేపీని ప్రజలు గెలిపిస్తారని బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని కుప్పిగంతలు వేసినా ఈ రెండు పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‍లో మాట్లాడిన ఆయన.. చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రంలో ఆమోదించి కేంద్రానికి పంపించి ఏడాయిది అవుతున్నా కేంద్రం ఇంకా స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి అయినప్పటికీ బీసీల ప్రయోజనాల కోసం పోరాటం చేశారని బీజేపీ 8 మంది ఎంపీలు బీసీల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్‍కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మా బీసీ బిడ్డలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ విభజన పై మోడీ అవహేళన చేసేలా మాట్లాడారరని తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్దంగా ఆయన తీరు ఉందన్నారు. తెలంగాణ పైన బీజేపీ నాయకులు విషం కక్కుతున్నారుని పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చారన్నారు.
మళ్లీ జీరోను చేస్తారు:
తెలంగాణ ప్రజలు బీజేపీ మళ్లీ జీరో చేస్తారని తగిన సమయంలో బీజేపీకి తెలంగాణ ప్రజలు సమాధానం చెపుతారన్నారు. కులగణనకు వ్యతిరేకమని పార్లమెంట్‍లో రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయడంతో బెంబేలు ఎత్తిపోయి దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. జనగణనలో కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన ఎందుకు చేయడం లేదని, 34 కాలమ్స్ లో ఎక్కడా బీసీ కుటుంబాల గణన లేదని అందుకు సంబంధించిన కాలమే లేదన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? తెలంగాణ ఏర్పాటును అవహేళణ చేసినందుకా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపర్చిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ గెస్తుందని డబల్ ఇంజన్ సర్కార్ రాబోతోందన్నారు. మేం అన్ని మతాలను గౌరవిస్తాం.. అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తామన్నారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నామని భద్రాచలం టెంపుల్‍కు నిధులు ఇచ్చాన్నారు. గోదావరి పుష్కరాలను బ్రహ్మంంగా చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ దోపిడి పై దర్యాప్తు జరుగుతోందని.. పోలీసులు దొంగలను పట్టుకుంటారన్నారు.
ఈ పది ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలి:
1.జాతీయ జనాభా గణనలో భాగంగా సమగ్ర కుల గణన చేస్తామని హామీ ఇస్తూ, 2025 ఏప్రిల్ 1న ఢిల్లీలో తీసుకున్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ఏమైంది?
2. ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమయ్యే దేశవ్యాప్త గృహ గణన మొదటి దశలో ఓబీసీ కుటుంబాలను ఎందుకు లెక్కించడం లేదు?
3. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప-కోటా ఎందుకు లేదు?
4. విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే, ఏకగ్రీవంగా ఆమోదించబడిన తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పైగా ఎందుకు నిర్లక్ష్యం చేసింది?
5.దేశవ్యాప్తంగా BC, SC, ST రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎందుకు తొలగించడం లేదు?
6. మీ 11 ఏళ్ల పాలనలో, భారతదేశంలోని 80 కోట్ల మంది ఓబీసీ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు?
7. రూ.80 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో, జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న ఓబీసీల సంక్షేమానికి కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించడం ఎలా సమర్థనీయం?
8.ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుపాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రవర్ణాలకు కూడా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అలాంటప్పుడు ఓబీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్లను ఎందుకు పెంచడం లేదు?
9. జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీలకు శాసనసభలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టడం లేదు?
10. మండల్ కమిషన్ సిఫార్సులను ఇప్పటికీ ఎందుకు పూర్తిగా అమలు చేయడం లేదు?






