DK Aruna: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీజేపీదే.. ఎంపీ డీకే అరుణ

by Ramesh Naini |

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరుతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

DK Aruna: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీజేపీదే.. ఎంపీ డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో (Congress) కాంగ్రెస్ పాలన తీరుతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆరోపించారు. (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి అనుభవ లోపంతో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రధాని మోడీ కలలు కంటున్న వికసిత్ భారత్ నిజం కావాలంటే గ్రామస్థాయి నుంచే దేశం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంత యువత నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

అందులో భాగంగానే యువత క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ చేరికలు మరింత పెరగాలి.. భవిష్యత్తు అభివృద్ధి కోసం యువకులంతా బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడినప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి రగలుగుతామన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి అర్హులకు చేరాలంటే అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉండాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధికంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు నివ్వాలని, భవిష్యత్తు రాజకీయాలల్లో యువతదే కీలకపాత్ర అని తెలిపారు.

Next Story