BJP : తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ వికసిత్ సభలు

by Muthe.Rajitha |

తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ "వికసిత్ సభలు'(BJP Vikasit Sabha) పేరిట రాష్ట్రవ్యాప్తంగా మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

BJP : తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ వికసిత్ సభలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ "వికసిత్ సభలు'(BJP Vikasit Sabha) పేరిట రాష్ట్రవ్యాప్తంగా మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కేంద్రంలో గత 11 ఏళ్ల నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, భద్రత, మౌలిక వసతులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు.

తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Election) దృష్టిలో పెట్టుకొని ఈ సభలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar), ఎంపీలు డి. అరవింద్ (నిజామాబాద్), గోడం నాగేశ్ (ఆదిలాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), ఎం. రఘునందన్ రావు (మెదక్), 8 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల లోపాలను ఎండగడుతూ.. కాళేశ్వరం, ధరణి ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు, ఓబీసీలకు జాతీయ బీసీ కమిషన్ ద్వారా చట్టబద్ధ హోదా వంటి అంశాలను హైలైట్ చేయనుంది. బూత్ స్థాయిలో ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జ్ నియామిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటెలా ప్రణాళికలు రచిస్తోంది.

Next Story