Seethakka: అదానీ అంబానీ మైనింగ్ కోసమే ఉపాధి హామీ చట్టం రద్దు సీతక్క సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

ఉపాధి హామీ చట్టం మార్పుతో బీజేపీ వెట్టిచాకిరిని మళ్లీ తీసుకురావాలని చూస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.

Seethakka: అదానీ అంబానీ మైనింగ్ కోసమే ఉపాధి హామీ చట్టం రద్దు సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైమిక్ బ్యూరో: ఉపాధి హామీ చట్టం (MNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ–జీ రామ్‌ జీ చట్టాన్ని (VB–G Ram Ji Act) తీసుకురావడం పట్ల మంత్రి సీత్కక్క (Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మళ్ళీ వెట్టి చాకిరి విధానాన్ని తేవాలని బీజేపీ ఆలోచిస్తోందని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క అదానీ అంబానీ మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధి హామీ చట్టం రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిదని ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. 27 లేదా 28 తేదీల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వలసలు తగ్గించేందుకు, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం గత యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టం తెస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టానికి ఉరేసిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రతి సంవత్సరం పని దినాలను తగ్గిస్తూ వస్తోంది. సొంత ఊర్లో పని హక్కు లేకుండా బీజేపీ చేస్తోందన్నారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేస్తే గ్రామాల్లో కూలీలకు పని ఉండదని ఆ కూలీలు తక్కువ కూలికే కార్పొరేట్లకు లభిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను అందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం బిక్షగా కాకుండా ఉపాధి హక్కుగా లభించే విధంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని అందరూ కాపాడుకోవాలన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి మేం వ్యతిరేకం అని

బాధ్యతాయుతంగా పనిచేయండి:

గ్రామ ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే విధంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నేడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్న మంత్రి..సర్పంచులు వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేస్తేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందనీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకత్వం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రజాప్రతినిధులు ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

Next Story