- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: కాంగ్రెస్ పార్టీ అసలు నిజ స్వరూపం ఇదే.. కేంద్రమంత్రి సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ అసలు నిజ స్వరూపం ఇదేనని, అంబేద్కర్ ను అన్నింటా ద్వేషించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister kishan Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అసలు నిజ స్వరూపం ఇదేనని, అంబేద్కర్ ను అన్నింటా ద్వేషించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister kishan Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) పై విమర్శలు చేస్తూ.. ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన.. అంబేద్కర్(Dr. BR Ambedkar) భారతరత్న(Bharatha Rathna) పురస్కారానికి అర్హుడని, నెహ్రూ ఇతర కాంగ్రెస్ నేతలు ఎన్నడూ భావించలేదని, కానీ నెహ్రూ(Jawahar Lal Nehru), ఇందిరాగాంధీ(Indira Gandhi)లకు భారతరత్న పురస్కారం లభించిందని తెలిపారు. దీనిపై కిషన్ రెడ్డి.. అంబేద్కర్ గారి పట్ల మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇదేనని వ్యాఖ్యానించారు. నెహ్రూను మొదలుకొని రాజీవ్ గాంధీ వరకూ ఢిల్లీ(Delhi)లో స్మారకాలను నిర్మించిన కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ కి ఆ గౌరవాన్ని ఇవ్వలేదని తెలియజేశారు.






