BJP: వందల ఏళ్ల కల సాకారమైన గొప్ప క్షణం ఇది.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |

వందల ఏళ్ల హిందువుల కల సాకారమైన గొప్ప క్షణం ఇది అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు.

BJP: వందల ఏళ్ల కల సాకారమైన గొప్ప క్షణం ఇది.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: వందల ఏళ్ల హిందువుల కల సాకారమైన గొప్ప క్షణం ఇది అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. అయోధ్యలో(Ayodhya) రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి, గత ఏడాది ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తిక పోస్ట్ పెట్టారు. దీనిపై ఆయన.. భారతీయుల అస్తిత్వానికి రూపమిచ్చిన మహోన్నత ఘట్టం.. యావత్ హిందూ సమాజం ఎదురుచూసిన ఆత్మగౌరవ ఉత్సవం.. అయోధ్యలో వెలసిన దివ్య భవ్య రామ మందిరం! అని కీర్తించారు. అలాగే మహాద్భుత మందిరం ఆవిష్కృతమై ఏడాది పూర్తైన శుభసందర్భంగా హిందూ బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేంద్రమంత్రి రాసుకొచ్చారు.

Next Story