BJP: నాంపల్లిలో ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్ ముట్టడించిన యాదవ సోదరులు

by Ramesh Goud |

నాంపల్లి (Nampally) బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP State Office) వద్ద ఉద్రిక్త (Tension) వాతావరణం నెలకొన్నది.

BJP: నాంపల్లిలో ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్ ముట్టడించిన యాదవ సోదరులు
X

దిశ, వెబ్ డెస్క్: నాంపల్లి (Nampally) బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP State Office) వద్ద ఉద్రిక్త (Tension) వాతావరణం నెలకొన్నది. యాదవులు (Yadavs) బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణ (Telangana)లోని బీజేపీ పార్టీ (BJP Party) ఇటీవల జిల్లా అధ్యక్షుల (District Presidents) నియామకం చేపట్టింది. ఈ జిల్లా అధ్యక్షుల పదవుల్లో తమ సామాజిక వర్గానికి ఒక్క పదవికి కూడా ఇవ్వలేదని యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాదవ సంఘం నాయకులు మేకల రాములు యాదవ్ (Yadav Sangam leader Mekala Ramulu Yadav) ఆధ్వర్యంలో యాదవ సోదరులు (Yadav brothers) బీజేపీ కార్యాలయం ముట్టడించారు. దీంతో పోలీసులు (police) వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యదవ సోదరులకు, పోలీసులకు మధ్య తోపులాట (scuffle broke) జరిగింది.

దీంతో బీజేపీ ఆఫీస్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత (minor tension) చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా జై యాదవ్ (Jai Yadav), బీజేపీ డౌన్ డౌన్ అని యాదవ సోదరులు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేగాక తెలంగాణలోని బీసీల (BCs)లో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలలో ఒకటిగా ఉన్న తమని బీజేపీ గుర్తించకపోవడం పట్ల అసహం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అలాగే యాదవులను జిల్లా అధ్యక్ష పదవులలో నియమించకపోవడానికి (not appointing) గల కారణాలు (Reasons) ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాగా బీజేపీ పార్టీ ఇటీవల జిల్లా అధ్యక్షుల కొత్త జాబితాను (New List) రిలీజ్ (Release) చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలుగా విభజించగా.. అందులో కొన్ని జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టింది. మొత్తం 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించగా.. మరి కొన్ని జిల్లాలకు మరో రెండు నియమించే అవకాశం ఉన్నది.

Next Story