- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు?.. నేడే ప్రకటన?
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఇప్పుడు ఈ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఇప్పుడు ఈ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌లలో ఒకరికి పదవి దక్కే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం ఉదయం నూతన అధ్యక్షుడికి పార్టీ జాతీయ నాయకత్వం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనుంది.
ఇక ఎన్నికల నిర్వహణకు కేంద్రం నుంచి నియమితులైన రిటర్నింగ్ అధికారిణి.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సోమవారం ఉదయం రానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అయితే నామినేషన్ దాఖలు చేయబోయేది ఒక్కరే అన్న సమాచారం అందుతోంది.
ఇటీవలి వరకు నాలుగైదు పేర్లు వినిపించినప్పటికీ.. ఆదివారం నుంచే ఈటల, రామచందర్‌రావుల పేర్లే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఇప్పటికే జాతీయ నాయకత్వం సేకరించినట్టు సమాచారం. పార్టీలో సీనియారిటీ ఉన్న నేతగా రామచందర్‌రావుకు సంఘ్ వర్గం మద్దతుగా నిలిచినట్టు సమాచారం. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరుపై చర్చ ఎక్కువైంది. పార్టీ బాధ్యతలు తనకే అప్పగిస్తారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు అధ్యక్షుడి ఎంపిక అనంతరం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.






