- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం మీది.. కాంగ్రెస్‌పై ఎన్వీ సుభాష్ ఫైర్
తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం మీది.. అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, ముందుంది అసలైన పండుగ అని పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం మీది.. అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, ముందుంది అసలైన పండుగ అని పేర్కొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌కు మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతోందని ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేపో మాపో తెలంగాణలో కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే.. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు వేస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఒక్క రూపాయి తక్కువ వేసినా ఒప్పుకునేది లేదన్నారు.
తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే.. ప్రజలే బండకేసి కొడతారని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలనే సాధించిందని హర్షించారు. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని, అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ 'హస్తం' కనుమరుగైందని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని విమర్శించారు.






