బీసీ కులం పెట్టుకుని సీఎం రేవంత్​రెడ్డి రాజకీయ లబ్దికి ఎత్తులు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

మున్సిపల్ ​ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్​రెడ్డి బీసీ కులానికి చెందిన ఓ కులం పెట్టుకుని ఓట్లు దండకునేందుకు ఎత్తులు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ కులం పెట్టుకుని సీఎం రేవంత్​రెడ్డి రాజకీయ లబ్దికి ఎత్తులు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ​ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్​రెడ్డి బీసీ కులానికి చెందిన ఓ కులం పెట్టుకుని ఓట్లు దండకునేందుకు ఎత్తులు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిలకు మాత్రమే పరిపాలించే అర్హత ఉందని గతంలో మాట్లాడిన ఆయన పేరు వెనుక యాదవ్, ముదిరాజ్, మాదిగ పెట్టుకున్నంత మాత్రాన ఆ వర్గాలు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదనేది వాస్తవమన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం నిమ్న వర్గాలను బలహీన వర్గాలను వారి కులాల గురించి మాట్లాడినా ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

వారి పార్టీ నాయకులకు ఎంపి పదవి, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఆ వర్గాలన్నీ రేవంత్ రెడ్డిని సమర్తిస్తారని భావించుకోవడం అవివేకం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగ సభలో ఉచ్చరించకూడని పదాలను ఉచ్చరించి తన స్థాయిని తగ్గించుకున్నారు. బొంద అనే పదం కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయం అన్నారు. ముఖ్యమంత్రి కలలు కంటూ ఇంకా ఎనిమిది సంవత్సరాలు తన అధికారంలో ఉంటాను అని మాట్లాడుతున్నారు. నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచిన విషయం మర్చిపోయావా? ఆ సీటు కాంగ్రెస్ పార్టీది అన్న విషయమైనా రేవంత్ రెడ్డికి తెలుసా అని చురకలు వేశారు. పచ్చి అబద్దాలతో మోసాలతో కుట్రలతో మార్ఫింగ్ లాంటి చేసి ప్రజలు మోసం చేసే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.

Next Story