రాష్ట్రంలో ఏ పార్టీ కూడా SIRపై రాజకీయాలు చేయకండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

by Ajay Maddhiboyina |

SIR అనేది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా మొద‌లుపెట్టిన చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌క్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు అన్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు.

రాష్ట్రంలో ఏ పార్టీ కూడా SIRపై రాజకీయాలు చేయకండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
X

దిశ‌, వెబ్ డెస్క్: SIR అనేది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా మొద‌లుపెట్టిన చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌క్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు అన్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. గ‌తంలో కూడా దేశంలో ప‌దిసార్లు ఎస్ఐఆర్ జ‌రిగింద‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 57వేల కోట్ల ఓట‌ర్లను ప్ర‌క్షాళ‌న చేశార‌న్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌మ పార్టీ నుండి బూత్ ఏజెంట్ ల‌ను నియ‌మిస్తామ‌ని చెబుతున్నార‌ని దానిని స్వాగ‌తిస్తున్నామ‌ని అన్నారు. కానీ బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మికి కార‌ణం ఎస్ఐఆర్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు.

ఎస్ఐఆర్ రాజ్యంగ‌బ‌ద్ధ‌మైన ప్ర‌క్రియ అని సుప్రీంకోర్టే చెప్పింద‌న్నారు. కాబ‌ట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎస్ఐఆర్ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. అదే విధంగా హైద‌రాబాద్ లో చాలా మ‌ది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉన్నార‌ని వారిని ఎస్ఐఆర్ ప‌రిధిలోకి రాకుండా ఉండే ప్ర‌య‌త్నం భార‌తీయ జ‌న‌తాపార్టీ చేస్తుంద‌ని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. రైతులకు గొనె సంచులు కూడా సప్లై చేయడం లేదని, రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు. ఇంకా కూడా కొనుగోలు సెంటర్‌లోనే ధాన్యం ఉందని అన్నారు.

Next Story