కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు రియాక్షన్ ఇదే..

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ అంశం ఆమె వ్యక్తిగత నిర్ణయమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.

కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు రియాక్షన్ ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ అంశం ఆమె వ్యక్తిగత నిర్ణయమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఛానల్‌తో రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై కవిత చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందని ఆరోపించిన ఆయన.. బీఆర్ఎస్‌ను కాపాడుతున్నది సీఎం రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటే అన్న కవిత వ్యాఖ్యలు ఆమె అవగాహనా లోపానికి నిదర్శనమని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు.

Next Story