- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం: బీజేపీ స్టేట్ చీఫ్ తీవ్ర ఆరోపణలు
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ తీవ్ర నష్టం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక ప్రభుత్వం (Almatti Dam) ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ తీవ్ర నష్టం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (BJP state chief Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడం డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నమేనని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను రక్షించడానికి, రైతులకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును ఆపకపోతే, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచాలనే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. జూరాల, నాగార్జునసాగర్, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు.
హైడల్ పవర్ కోసం, రైతులకు సాగునీరు కోసం కృష్ణానదిపై ఆధారపడ్డామని కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో రైతులకు నష్టం జరుగుతుందనే కారణంతోనే గతంలో సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. 2013లో ఎత్తు పెంచాలని ప్రయత్నం చేసిందని, స్వ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తెలంగాణకు కృష్ణా జలాల వాటా కేవలం 299 టీఎంసీలు సరిపోతుందని కేసీఆర్ సంతకం చేయడంతో నదీజలాల వాటాలో తెలంగాణకు నష్టం ఏర్పడిందన్నారు.
గతంలో బీఆర్‌ఎస్, ఇప్పడు కాంగ్రెస్
గత కేసీఆర్ ప్రభుత్వం నీటి వాటా విషయంలో తెలంగాణకు నష్టం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని అందుకే బీఆర్‌ఎస్ కు ఈ విషయంలో మాట్లాడే నైతిక అర్హత కోల్పోయిందన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశంపై పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భవిష్యత్తులో డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నంలో ఇది ఒక ముందస్తు చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారీ ఢిల్లీ వెళ్తుతారని, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనిపై ఆలోచన చేయాలని సూచించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరుకు నీరు ఆగిపోతే ఎందుకు నోరు మూసుకుంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యాస కాంట్రాక్టులు, కమీషన్ల పైనే ఉందని కృష్ణా జలాల వాటాను రక్షించడంపై లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.






