చార్మినార్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు.. కాసేపట్లో బాధ్యతల స్వీకరణ

by Gantepaka Srikanth |

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) హైదరాబాద్‌లోని చార్మినార్‌(Charminar)కు వెళ్లారు.

చార్మినార్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు.. కాసేపట్లో బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) హైదరాబాద్‌లోని చార్మినార్‌(Charminar)కు వెళ్లారు. శనివారం ఉదయాన్నే భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాంచందర్ రావు వెంట పలువురు బీజేపీ కీలక నేతలు ఉన్నారు. చార్మినార్ నుంచి నేరుగా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళి అర్పిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతారని సమాచారం.

అయితే, ఇటీవల తెలంగాణ భారతీయ జనతా పార్టీ(Telangana BJP) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కొన్ని అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే రామచంద్రరావును పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కిషన్ రెడ్డి స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన శనివారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Next Story