రెండు, మూడ్రోజుల్లో క్యాండిడేట్ ఫైనల్.. జూబ్లీహిల్స్‌లో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలి: బీజేపీ స్టేట్ చీఫ్

by Ramesh Naini |

జూబ్లీహిల్స్‌లో బీజేపీదే గెలుపు.. నియోజక ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు, మూడ్రోజుల్లో క్యాండిడేట్ ఫైనల్.. జూబ్లీహిల్స్‌లో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలి: బీజేపీ స్టేట్ చీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌లో బీజేపీదే గెలుపు.. నియోజక ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు (Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల ప్రధాన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశాయని, ఓట్లను అడిగే నైతిక హక్కు రెండు పార్టీలకు లేదన్నారు. ఫ్రీ బస్ అని చెప్పు సామాన్యులపై భారం వేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లజ్జ.. ఏమైనా ఉందా..? అని ఫైర్ అయ్యారు. హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి (Prime Minister Modi) మోడీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయన్నారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారని తెలిపారు. నగరాన్ని వరల్డ్ కే తలమానికంగా మారుస్తామని బీఆర్ఎస్ గతంలో చెప్పింది కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదన్నారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ మ్యాన్ హోల్స్ లో పడి, అగ్ని ప్రమాదాలు జరిగి మరణిస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయని ఆరోపించారు.

ఎర్రగడ్డలో ప్రజలు, కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికకు ల్యాండ్ కేటాయిస్తున్నారని అన్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పరిధిలో గుళ్లు కూలగొడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు మూడ్రోజుల్లో క్యాండిడేట్ ను ఫైనల్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి అంతా జూబ్లీహిల్స్ లో తిరిగి ప్రచారం చేయాలని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాజకీయ మార్పు చూడండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, తదితర నేతలు పాల్గొన్నారు.

Next Story