- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ నుండి ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదు.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడిగా నేడు రాంచందర్ రావు(Ramchander Rao) బాధ్యతలు తీసుకోబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడిగా నేడు రాంచందర్ రావు(Ramchander Rao) బాధ్యతలు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే హైదరాబాద్‌లోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చింది.. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్నాను.. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకం అయింది.. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా... సంతోషంగా ఉంది.. తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుంది అని రాంచందర్ రావు కీలక ప్రకటన చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని ఎప్పుడూ బీజేపీ మోసం చేయదు.. అందుకు నేనే ఉదాహరణ, క్షేత్రస్థాయి కార్యకర్త వరకూ అందరినీ గుర్తించి కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన అందరికీ అవకాశాలు ఉంటాయి. విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు వీడినా పార్టీకి నష్టం లేదు. పార్టీ వ్యక్తుల కోసం పనిచేయదు. ప్రజలు, వ్యవస్థ కోసం పనిచేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.




