- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలి:ఆర్.కృష్ణయ్య
by Prasad Jukanti |
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో:ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోడీ పదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలకు ఒక్క పథకం కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. ఈ దేశంలోని బీసీలంతా కులవృత్తులలోనే ఉండాలనే బానిస మనస్తత్వం, అగ్రకుల అహంకారం ఈ పాలకులకు ఉందని ఆరోపించారు. ఇది మార్చుకోవాలని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని తాము ఈదేశంలో వాటా దారులమన్నారు.
Next Story






