BJP: రేవంత్ లక్కీ లాటరీ ముఖ్యమంత్రి.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
BJP: రేవంత్ లక్కీ లాటరీ ముఖ్యమంత్రి.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: అధికారంలో వచ్చి ఏడాది పూర్తైన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరు గ్యారెంటీలు(SIX Garentees) ఎందుకు ఇవ్వలేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకుంటుందని, ఆడపిల్లలకు 2500 ఇచ్చారా? అని, నిరుద్యోగులకు ఇస్తానన్న 4 వేల భృతి ఇచ్చారా? అని, ఆడపిల్లలకు ఇస్తామన్నా స్కూటీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా మీరిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగితే, బీజేపీ నేతలు నన్ను విమర్శిస్తున్నారని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది నోరేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఒక ముఖ్యమంత్రి నోరు చేసుకొని మాట్లాడినందుకే ప్రజలు గద్దె దించిన విషయం సోయి తప్పినట్లు ఉన్నాడని ఫైర్ అయ్యారు. తిట్టకుంటే కేసీఆర్(KCR) కంటే తక్కువ అయిపోతానని, ముఖ్యమంత్రిని అనిపించుకోనని కేసీఆర్ కంటే ఎక్కువ తిడుతున్నాడని దుయ్యబట్టారు. ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని, ఎంపీలను, కేంద్రమంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ఢిల్లీకి పోయి పేపర్లు ఇచ్చి అడుక్కొని వస్తాడని, బయటికి వచ్చాక మరో రకంగా మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లక్కీ లాటరీ ముఖ్యమంత్రి అని, ఆ పదవికి అయినా గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇచ్చారని, కానీ ఇప్పుడు వచ్చిన మార్పు చూసి ప్రజలే అధికారం ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారని డీకే అరుణ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed