కేసీఆర్ కుటుంబం నుంచి ఎన్ని కోట్లు కక్కించారు? కాంగ్రెస్ కు ఎంపీ రుఘునందన్ రావు ప్రశ్న

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ బై పోల్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చార్జి షీట్ విడుదల చేసింది.

కేసీఆర్ కుటుంబం నుంచి ఎన్ని కోట్లు కక్కించారు? కాంగ్రెస్ కు ఎంపీ రుఘునందన్ రావు ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని అది అభయస్తం కాదు భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక (Jubilee Hills Bypoll) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనపై 'బూటకపు హామీలు మోసపూరిత వాగ్ధానాలు' పేరుతో ఇవాళ బీజేపీ చార్జిషీట్ విడుదల చేసింది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు ఈ చార్జిషీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులను కక్కించి కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీల అమలు చేస్తామని రాహుల్ గాంధీతో చెప్పించారని మరి కేసీఆర్ కుటుంబం వద్ద ఎన్ని కోట్లు కక్కించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి హామీగా ప్రతిరోజు ప్రజాదర్బార్‍ను నిర్వహిస్తామని చెప్పిన హామీ ఇచ్చిందని ఫస్ట్ హామీనే అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు.

111 జీవో రద్దు చేయడం వెనుక లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు తానే దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 30 శాతం కమీషన్ సర్కార్ అని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కమిషన్లు తీసుకుంటోదంని ఈ విషయాన్ని స్వయంగా సెక్రటేరియట్ వద్ద కాంట్రాక్టర్లే చెబుతున్నారన్నారు. రేవంత్ సర్కార్ లో మంత్రులు ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారో కావాలంటే ఆడియో వినిపించాలంటే వినిపిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు రూ. 12 ఇస్తామని హామీ ఇచ్చి ఎంత మంది డ్రైవర్లకు ఆ డబ్బులు ఇచ్చారో చెప్పమన్నారు.

Next Story