- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పరిపాలనకు పక్షపాతం: బీజేపీ చీప్ రాంచందర్రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి 22 నెలలు గడిచిన వాటి ఊసే లేదన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి 22 నెలలు గడిచిన వాటి ఊసే లేదన్నారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోయిందని, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, మలేషియా, సింగపూర్ పర్యటనలకు వెళ్లి రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామన్నారని మరి ఆ పెట్టుబడులు ఏమైనట్లు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు విదేశీ పర్యటనల ప్రయాణ, ఫ్లైట్ ఖర్చులు వృథా చేయడం తప్ప తెలంగాణకు ఒరగబెట్టింది గుండుసున్నా అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా సక్రమంగా ప్రారంభించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైంది. రేవంత్పరిపాలనకు పక్షవాతం వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రం మెడలు వంచుతామని విమర్శలు చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను, మోసాన్ని ప్రజల గ్రహించారు. వాస్తవ పరిస్థితులను గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధిచెబుతారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని హైకోర్టు తేల్చింది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఇది వారి అసమర్థతను చూపుతోందన్నారు.
అంధకారంలో యూనివర్శిటీలు :
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఖాళీ పోస్టులు, బోధన లోపాలు విద్యా నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్ కూడా అంధకారంలో పడే పరిస్థితికి వచ్చింది.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిటీని ఏర్పాటు చేసినా, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి అంశాలను మాత్రమే సీబీఐ విచారణకు అప్పగించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ పూర్తి విచారణ జరగాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు బ్యారేజీలపైన మాత్రమే విచారణ ఆమోదించింది. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన అన్ని అంశాలపై సీబీఐ విచారణకు కోరాలి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెబుతున్నారు. నిజానికి తెలంగాణకు కేంద్రం కావాల్సినంత యూరియాను అందించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను దాస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఇండియా కూటమిలో పార్టీల మధ్య విబేధాలు :
ఇండియా కూటమిలోని పార్టీలలో ఐక్యత ఎప్పుడూ లోపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఉంటే, మిగతా పార్టీలవి ఒక మాటగా కొనసాగతాయి.కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘన ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. అనేకసార్లు రాజ్యాంగాన్ని అవమానపరిచారు. గవర్నర్ల పదవులు, రాజ్యాంగ సంస్థల విషయంలో కూడా కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు రాజ్యాంగ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ నేతృత్వంలో ఎమర్జెన్సీను ప్రకటించడం, రాజ్యాంగాన్ని కాలరాసి, అవహేళన చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్, స్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






