- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మా బలం పెరిగింది.. బీఆర్ఎస్ బలం తగ్గింది: రాంచందర్ రావు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) స్పందించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గిందని అన్నారు. మాకు 20 శాతం ఓట్లు పెరిగాయని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ల మద్దతుతో మరికొన్ని చైర్మన్ సీట్లు తెలుస్తున్నట్లు చెప్పారు. మజ్లిస్ డైరెక్షన్‌లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు వేశారని రాంచందర్ రావు విమర్శించారు. నారాయణపేట, ఆదిలాబాద్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 350కి పైగా వార్డుల్లో విజయం సాధిస్తామని అంచనా వేశారు. చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయామని అన్నారు. కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామని తెలిపారు. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచిందని అన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. మా విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతబడ్డాయని కామెంట్ చేశారు. 750 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని అభినందించారు. కొత్తగూడెం హంగ్ దిశగా ఉండటంతో సీపీఐకి మద్దతిస్తామని కేటీఆర్ బహిరంగ ప్రకటన చేశారు.






