- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ ప్రకటన సంతోషాన్నిచ్చింది: తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ షాకింగ్ స్టేట్‌మెంట్
ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని దత్తాత్రేయ(Dattatreya)కు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని దత్తాత్రేయ(Dattatreya)కు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని.. అలాగే తెలగు వారికి సరైన గౌరవం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఈ మాటలు ఇండియా కూటమి తరుపున కాదని.. తెలంగాణ ప్రజల తరుపున మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. అయితే.. సీఎం రేవంత్ డిమాండ్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని సెటైర్ వేశారు. నోబెల్ కాదు.. గోబెల్స్ ప్రచారం ప్రైజ్ ఇవ్వొచ్చు అని విమర్శించారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ కోరడం సంతోషాన్చిందని అన్నారు. తాము కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక డిమాండ్ చేస్తున్నామని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేదా? పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేవారు. అప్పుడు తాము కూడా మీరు చేసిన డిమాండ్స్‌ను పరిగణలోకి తీసుకుంటామని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఎన్డీఏ కూటమి దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటిస్తే.. ఆయనకు మద్దతు ఇచ్చేలా ఇండియా కూటమితో తాను మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.






