తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే.. ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-06-02 05:05:06  IST  )

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే.. ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ సహకారం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం బీజేపీ పోరాటం చేసిందన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తే.. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిందన్నారు. ఇప్పుడు రేవంత్ పాలన అంతా కలెక్షన్లు.. కమీషన్ల మీదే నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని విమర్శించారు. పాలన చేతకాక.. కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించడం, కేంద్ర మంత్రులను తిట్టడమే రేవంత్ పనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం

అయితే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వం రావాల్సి ఉందని ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప.. రాష్ట్రానికి సంబంధించిన రూ.8 లక్షల కోట్ల అప్పులు తీరవని, రాష్ట్రం అభివృద్ధి చెందని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం నరేంద్ర మోడీ ప్రభుత్వమన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందని, ఆ రాష్ట్రాల్లో నిధులు దారి మళ్ళించడం లేదని, వాపస్ కూడా పోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందన్నారు. అందుకే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యం.. ప్రజల ఆశల్ని నెరవేర్చాం : సీఎం రేవంత్ రెడ్డి

Next Story