- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నిధులతోనే ఇల్లు కట్టుకున్న, కుమారుడి పెళ్లి చేశా: బీజేపీ ఎంపీ (వీడియో)
బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు బాపూరావు స్వయంగా అంగీకరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు బాపూరావు స్వయంగా అంగీకరించారు. ఈ ఏడాది వచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధుల పంపకం కోసం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో బాపూరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నిధులతోనే తాను ఇంటిని నిర్మించుకున్నానని, ఆ నిధులతోనే తన కుమారుడి వివాహం కూడా చేశానని హాట్ కామెంట్స్ చేశారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్న మాట వాస్తవమే అయినా గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నేనేమి నిధుల గోల్ మాల్ కు పాల్పడలేదన్నారు. ఒక ఎంపీగా తనకంటూ సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే ఉద్దేశంతోనే ఆ నిధులతో తాను ఇంటిని నిర్మించుకున్నట్టు వెల్లడించారు. ఎంపీ స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read,,
ఈటల ‘సైలెంట్’.. T-బీజేపీలో తీవ్ర దూమారం రేపుతోన్న MLA వ్యవహారం..!






