- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం-బస్తర్ కారిడార్‌ను నాలుగు లేన్లుగా విస్తరించండి: రైల్వే మంత్రికి MP వద్దిరాజు వినతి
తెలంగాణ, మధ్య భారతానికి వ్యూహాత్మక జీవనాధారమైన ఖమ్మం- బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, మధ్య భారతానికి వ్యూహాత్మక జీవనాధారమైన ఖమ్మం- బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో శుక్రవారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రవిచంద్ర, సురేశ్‌రెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో అనుసంధానం, భద్రత, ఆర్థికాభివృద్ధిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఒక కీలకమైన మౌలిక సదుపాయాల లోపం గురించి దృష్టి సారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హై- స్పీడ్ కారిడార్ల ద్వారా హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు ఉన్న రహదారి మార్గంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు. అయితే.. ఖమ్మం వెలుపల కొత్తగూడెం-భద్రాచలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల అనుసంధానం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ కారిడార్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదని.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే వ్యూహాత్మకమైనదని చెప్పారు. ఈ నెట్‌వర్క్‌కు కొత్తగూడెం కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలు తరుచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవాల్సి వస్తున్నదని వివరించారు. ఖమ్మం-కొత్తగూడెం-భద్రాచలం-బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.






