- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే కాంగ్రెస్ బీసీలపై బహిరంగ చర్చ పెట్టాలి.. ఎంపీ రఘునందన్ రావు సవాల్
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

దిశ, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చర్చ అనేది బహిరంగంగా ఉండాలని డిబేట్ చేసే విధంగా ఉండాలన్నారు. తెలంగాణ సమాజం ముందు ఈ చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే కేబినెట్‌ను రీసెట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కేబినెట్ లో ముగ్గురే బీసీలు ఉన్నారని తెలిపారు. మోడీ కేబినెట్‌లో 21 మంది బీసీలు ఉన్నారని చెప్పారు. 31 శాతం బీసీలను బీజేపీ సీఎంలుగా చేసిందని వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ 17 శాతం మందినే సీఎం చేసిందని అన్నారు. కులగణన లెక్క ప్రకారం బీసీలకు 8 మంత్రి పదవులు ఇవ్వాలని ముగ్గురికే ఇచ్చారని విమర్శించారు. కులగణన గొప్పగా చేశామని చెబుతున్న రేవంత్ దమ్ముంటే ఆచరణలో పెట్టాలని అన్నారు.






