BJP: మళ్లీ మళ్లీ ఢిల్లీ - ఇదే రేవంత్ లొల్లి.. ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్

by Ramesh Goud |   (  Updated:2024-12-10 12:20:19  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రఘునందన్ రావు(MP Raghunandan Rao) సంచలన విమర్శలు(Criticised) చేశారు.

BJP: మళ్లీ మళ్లీ ఢిల్లీ - ఇదే రేవంత్ లొల్లి.. ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రఘునందన్ రావు(MP Raghunandan Rao) సంచలన విమర్శలు(Criticised) చేశారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన.. మళ్లీ మళ్లీ ఢిల్లీ - ఇదే రేవంత్ లొల్లి అని ఎద్దేవా చేశారు. అలాగే గల్లీలో అధికారం.. ఢిల్లీలో బేరసారం అని, కష్టాల్లో తెలంగాణ ప్రజలు.. పర్యటనల్లో ముఖ్యమంత్రి వర్యులు అని ఆరోపణలు చేశారు.

అంతేగాక ప్రజలు వరదల్లో ఉండనీ, నిరుద్యోగులు రోడ్డెక్కనీ, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలవనీ, మహిళలపై అఘాయిత్యాలు జరగనీ, రైతులు ఆత్మహత్యలు చేసుకోనీ అంటూ.. రేవంత్ మాత్రం రాహుల్(Rahul Gandhi), సోనియా(Sonia Gandhi)ల ప్రసన్నానికై ఢిల్లీ వెళ్లాల్సిందేనని దుయ్యబట్టారు. పదవుల పందేరాలకై.. కార్పొరేషన్ కమిషన్లకై.. మంత్రవర్గ మతలబులకై.. సూటుబూట్లతో ఢిల్లీ పోవాల్సిందేనని రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్ లలో పర్యటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

Next Story