- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. CM రేవంత్‌పై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పాలన పడకేసిందని అన్నారు. వ్యవస్థల మీద అవగాహన లేకపోవడం మూలంగా సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని అన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రులు తన మాటలను వినడం లేదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Theenmar Mallanna)ను సస్పెండ్ చేశారని అన్నారు. మామునూర్ ఎయిర్‌పోర్టుతో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కృషితోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు మంజూరు అయిందని గుర్తుచేశారు. పక్క పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు.. మళ్లీ బీఆర్ఎస్‌లోకే వెళ్లేలా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(Chinna Reddy) ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం పార్టీ తరఫున ఉత్తర్వులు జారీ చేశారు. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కులగణన సర్వేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం మల్లన్నకు షోకాజు నోటీసులు జారీ చేసింది. గడువు ముగిసినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు






