- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయం రాహుల్ దృష్టికి రాలేదా?: రఘునందన్‌రావు
కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో గురువారం విచారణ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో గురువారం విచారణ జరిగింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) అత్యున్న న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. ఇం హడావిడిగా అక్కడ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అని నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించి.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) స్పందించారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంతీర్పు విద్యార్థుల సమైక్య విజయమని అన్నారు. విద్యార్థుల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ విషయం రాహుల్(Rahul Gandhi) దృష్టికి రాలేదా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. భవిష్యత్తులో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటామని రఘునందన్ కీలక ప్రకటన చేశారు.
Also Read..






