- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP MP: ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టింది.. రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేదేంటి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ఆల్రెడీ అడుగు పెట్టింది.. ఇంకా రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేది ఏంటి? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిలో బీజేపీ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించిన చేవెళ్లలోనూ బీజేపీనే గెలిచింది. రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలిచిందని రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డే చివరి సీఎం అని హాట్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌లోని నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ(Prime Minister Modi) మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ గాడ్సే సిద్దాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ అంటే ప్రధాని మోడీకి భయం.. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాడనే లోక్ సభలో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదని అన్నారు. దేశాన్ని విభజించడమే మోడీ లక్ష్యం అందుకే తెలంగాణలో బీజేపీని, మోడీని అడుగు పెట్టనివ్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రఘునందన్ రావు స్పందించి సీఎం రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు.






