ఆస్పత్రిలో చేరిన MP రఘునందన్ రావు.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు

by Gantepaka Srikanth |

తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి(Yashoda Hospitals)లో చేరారు. ఆర్థోపెటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆస్పత్రిలో చేరిన MP రఘునందన్ రావు.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి(Yashoda Hospitals)లో చేరారు. ఆర్థోపెటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రఘునందన్ రావు స్టేట్‌మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి రానున్నారు. కాగా, గురువారమే ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్‌రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు శాఖ మెదక్‌ ఎంపీకి భద్రత అవసరమని నిర్ధారణకు వచ్చింది. ఇకపై రఘునందన్‌రావు పర్యటనలో ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే.. రఘునందన్ రావు ఆసుపత్రిలో చేరాడనే విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Next Story