- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Laxman: తెలంగాణలో భూకుంభకోణం.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కుని పెద్ద కుంభకోణానికి తెరలేపుతున్నారని, తెలంగాణలో ఇండస్ట్రీ భూములను బడా వ్యాపార వేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కుని పెద్ద కుంభకోణానికి తెరలేపుతున్నారని, తెలంగాణలో ఇండస్ట్రీ భూములను బడా వ్యాపార వేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పారిశ్రామిక భూములను అప్పనంగా అమ్మి దానితో వచ్చిన కమిషన్లలతో ఢిల్లీకి కప్పం కట్టేందుకు ముఖ్యమంత్రి ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని గుర్తుచేశారు.
పారిశ్రామిక భూములను ప్రజా ప్రయోజనాల కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక భూములను బలవంతంగా తీసుకునే పాలసీని మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణలో ఒక బీజేపీ ఎంపీకి అధిష్టానం నోటీసు ఇచ్చిన అంశం తన దృష్టికి రాలేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిపై ఎక్కడ తప్పు జరిగిందో సమీక్ష చేస్తున్నామని, భవిష్యత్తులో అలాంటి తప్పిందాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని, అందులో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో పారిశ్రామిక భూములు కాపాడుతామని పేర్కొన్నారు.






