కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలినట్లే.. BRS మూడు ముక్కలైంది.. కవిత సస్పెండ్‌పై ఎంపీ లక్ష్మణ్ రియాక్ట్

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలినట్లే.. BRS మూడు ముక్కలైంది.. కవిత సస్పెండ్‌పై ఎంపీ లక్ష్మణ్ రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ కవిత టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న కాళేశ్వరం కూలింది.. నిన్న బీఆర్‌ఎస్‌ కూలింది. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలినట్లే.. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.. అని అన్నారు. అలాగే అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదని ఎంపీ లక్ష్మణ్‌ చెప్పుకొచ్చారు. అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత తేల్చిచెప్పిందని అన్నారు. కేసీఆర్‌ను బలిపశువు చేసి.. అవినీతికి కారకులు హరీశ్ రావు, సంతోష్ రావు అని కవిత స్పష్టం చేసిందన్నారు. కాళేశ్వరం అవకతవకలపై నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలని, దానికి కారకులను శిక్షించాలని కోరారు. కాళేశ్వరం అవినీతిపై ఆధారాలు ఇచ్చి సీబీఐకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story