- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP MP: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి తామేం వ్యతిరేకం కాదు
యమునా నది(Yamuna River) ప్రక్షాళన సహా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: యమునా నది(Yamuna River) ప్రక్షాళన సహా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది ప్రక్షాళనకు కూడా తాము వ్యతిరేకం కాదని అన్నారు. సామాన్యులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల(HYD Musi Catchment Areas) ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన ప్రభుత్వానికి సూచించారు. అతి త్వరలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి తాను ఎక్కడా చూడలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ.. తానే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భుజాలు తడుముకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం లేదని అన్నారు. వాటితో పాటు మహిళలకు రూ.2500, వృద్ధులు, వికలాంగులకు పెంచిన ఫించన్లు, బతుకమ్మ చీరలు, రైతుబంధు, రైతు భరోసా, దళితబంధు ఇలా అన్ని అటకెక్కాయని అన్నారు. ఒక్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప రాష్ట్రంలో ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు కావడం లేదని తెలిపారు.






