- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP: తెలంగాణలో ఆ MLC బీజేపీ గెలవడం ఒక చరిత్ర
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC) ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక చరిత్ర అని ఆ పార్టీ కీలక నేత

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC) ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక చరిత్ర అని ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(BJP MP Laxman) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్క కొమురయ్య(Malka Komaraiah) గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. ఎవరికీ అవకాశం లేకుండా.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే తాము గెలిచామని అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ(Teachers' MLC) ఎన్నికల్లో ఇంతకు బీజేపీ గెలవలేదని.. ఈ గెలుపుతో చరిత్ర తిరగరాశామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను విమర్శించే వారంతా.. ముందు రాష్ట్ర అభివృద్ధికి వారేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి.. ప్రజల దృష్టిని మరల్చడానికి కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముందు వరంగల్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను సమగ్రంగా అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ పరిపాలనపై అవగాహన లేదని విమర్శించారు. అంతా రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీటు ఎప్పుడు ఖాళీ అవతుందా? ఎప్పుడు లాక్కుందామా? అనే చూస్తున్నారని అన్నారు. కాగా, అంతుకుముందు.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్య(Malka Komaraiah)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ బీజేపీ చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించి ఆదరించారని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఈ గెలుపు గుణపాఠం అని పేర్కొన్నారు.






