మోడీ స్వయంగా చెప్పినా రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదు.. CM రేవంత్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

by Gantepaka Srikanth |

రాష్ట్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఇచ్చిన ఆహ్వానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కేంద్ర ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నట్లు ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్ మండిపడ్డారు.

మోడీ స్వయంగా చెప్పినా రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదు.. CM రేవంత్‌పై బీజేపీ ఎంపీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఇచ్చిన ఆహ్వానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కేంద్ర ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నట్లు ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గదని ప్రధాని మోడీ, అమిత్​షా స్వయంగా చెప్పినా రాద్దాంతం చేయడం సరికాదన్నారు. వచ్చే ఏడాదిలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతన్నందున ముఖ్యమంత్రి స్టాలిన్ తన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో ప్రజల దృష్టి మళ్లించి లబ్ధి పొందాలనే దురాలోచనలో ఉన్నాడని విరుచుకపడ్డారు.

డీలిమిటేషన్ తెరమీదికి తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రో రేటా అనుగుణంగా ఒకవేళ పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు అని స్పష్టం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ విఫలం చెందారని, అవినీతికి పాల్పడ్డారని, దీంతో తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపిని ఆదరిస్తారనే భయం ఆయనలో పట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల్లో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెరిగింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి, కాలం వెళ్లబుచ్చడానికి చేస్తున్న ప్రయత్నమన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న తెలంగాణ పట్ల , దక్షిణాది అభివృద్ధి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.

Next Story