- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపై బీజేపీ MP క్లారిటీ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌ను ఆయన "చచ్చిన పాము"తో పోలుస్తూ, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చిచెప్పారు. ప్రజలు బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాజకీయంగా అంతరించిపోతున్న పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఆయన ఎద్దేవా చేశారు.
పొత్తు ప్రచారాలకు చెక్..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయంటూ సాగుతున్న ప్రచారాలపై లక్ష్మణ్ స్పష్టతనిచ్చారు. "బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. అలాంటి వార్తలన్నీ నిరాధారమైనవి" అని ఆయన స్పష్టం చేశారు. కమలం పార్టీ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తుందని, తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ మొదలవ్వగా, ఇటు పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.






