Vote Chori: దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చండి.. బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్

by Ramesh Naini |

కరీంగనర్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Vote Chori: దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చండి.. బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కూడా (Vote Theft Controversy) ఓట్ చోరీ అంశం చర్చానీయాంశంగా మారింది. సోమవారం కరీంగనర్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మూడో సారి గెలవడానికి ఓట్ల చోరీనే కారణమని, కరీంనగర్‌ పట్టణంలో ఓ రేకుల షెడ్డు ఉన్న ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయని, దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లతో వారు ఆరవై ఏళ్ల పాలన చేసినట్లు ఉన్నారని, అందుకే మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. (Prime Minister Modi) ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశంలో అవినీతికి చరమగీతం పాడారని అన్నారు.

అవినీతి లేని పాలన కారణంగా మోడీని మూడోసారి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారని డీకే అరుణ చెప్పారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం దొంగ ఓట్ల రాగం అందుకుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తన ప్రాబల్యం కోల్పోతున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు భావించడం లేదన్నారు. తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని బీజేపీ ముందే చెప్పిందని, ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు కూడా ఇచ్చినట్లు గుర్తుకు చేశారు. దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చండని అని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఉన్న దొంగ ఓట్లను ఏరివేయాలని సవాల్ చేశారు. గ్రామాల్లో ఓటు లేని వారు ఎంతో మంది ఉన్నారని అటువంటి వారికి ఓటు హక్కు కల్పిస్తూ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. అలాంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోగా.. ఓట్ చోరీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రధాని మోడీ పాలన గురించి వీరి దగ్గర మాట్లాడడానికి ఏమి లేకపోవడంతో (Vote Chori) ఓట్ చోరీ అనే రాగం ఎత్తుకున్నారని ఫైర్ అయ్యారు.

Next Story