- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Arvind: ఇది రేవంత్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) హైకోర్టు బ్రేక్ వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) హైకోర్టు బ్రేక్ వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) స్పందించారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని విమర్శించారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిలువునా మోసం చేశారని అన్నారు. పరిపాలన చేతగాక డ్రామాలు ఆడటం అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. బీసీలపై రెడ్డికి చిత్తశుద్ధి లేదని అందుకే ఈ డ్రామా అని విమర్శించారు. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లకు రెండు వారాలు, ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.






