- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదంతా హామీలు ఇచ్చేముందు తెలియదా?.. CM రేవంత్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్
ఎన్నికల్లో మీరు గొప్పగా ప్రకటించిన హామీలనే ఉద్యోగులు అడుగుతున్నారు.. తీరా గద్దెనెక్కిన తర్వాత సమ్మె చేయొద్దు..

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో మీరు గొప్పగా ప్రకటించిన హామీలనే ఉద్యోగులు అడుగుతున్నారు.. తీరా గద్దెనెక్కిన తర్వాత సమ్మె చేయొద్దు.. ఆందోళనకు దిగొద్దు అంటే ఎలా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) కౌంటర్ ఇచ్చారు. హామీలు ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక బీద అరుపులు అరుస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కాగా, ఉద్యోగుల సమ్మె సమరంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సమరం తెలంగాణ ప్రజలపైననా? మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా? సమస్య ఉంటే చర్చించుకుందాని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై సీఎంపై విమర్శలు చేశారు.






