- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందశాతం CM రేవంత్ రాసిచ్చిన స్క్రిప్టే.. బీజేపీ ఎమ్మెల్యేలు సీరియస్
గ్రేటర్ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మంగళవారం దన్పాల్సూర్యనారాయణ గుప్త, రామారావు పవార్, రాకేష్‌రెడ్డిలు విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా పేదల ఇళ్లను కూల్చివేస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ఓ సైకోలా, శాడిస్టుల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఎలాంటి పునరావాసం కల్పించకుండా వారి నివాసాలను హైడ్రా సంస్థ కూల్చివేస్తుండడంతో, పేదలు నిర్వాసితులు అవుతున్న అంశంపై సీఎం స్పందించాలని డిమాండ్‌చేశారు.
పేదల పునరావసం గురించి మాట్లాకుండా.. ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేతలతో ఎదురు దాడి చేయించడం ముమ్మాటికీ దివాళాకోరు రాజకీయమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడడం ఆయన చిల్లర రాజకీయాలకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ నేతల కామెంట్లు చూస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే చదివినట్టు ఉంది. ప్రాపకం కోసం, పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఈటెలపై విమర్శలు చేశారని పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చుతున్న హైడ్రాకు హైదరాబాదు పాతబస్తీలో ఓ చెరువును ఆక్రమించి ఎంఐఎం అధినేత ఒవైసీ నిర్మించిన కాలేజీని కూల్చే దమ్ము లేదా, ఎందుకని బుల్డోజర్లు పాతబస్తీకి పోలేకపోతున్నాయని నిలదీశారు. అకడిమిక్ ఇయర్ మధ్యలో కూల్చితే విద్యార్థులు నష్టపోతారని చెప్పిన హైడ్రాకు ఇపుడు వేసవి సెలవులని గుర్తులేదా? అని ప్రశ్నించారు.






