BJP MLA: ఆ అధికారులు అందరూ శిక్షార్హులే.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైడ్రా(Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్‌(Ranganath)ను బీజేపీ(BJP) నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(Venkataramana Reddy) కలిశారు.

BJP MLA: ఆ అధికారులు అందరూ శిక్షార్హులే.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్‌(Ranganath)ను బీజేపీ(BJP) నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(Venkataramana Reddy) కలిశారు. ఈ సందర్భంగా పలు అక్రమ నిర్మాణాల(Illegal structures)పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని రెండు నెలల క్రితమే చెప్పానని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లమంటున్నారని అన్నారు. అసలు అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్షార్హులే అని అన్నారు.

Next Story