- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కూడా ఫార్మాట్ మార్చాలి.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీజేపీ కూడా ఫార్మాట్ మార్చాలి.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కీలక నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(MLA Rakesh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా బిహార్ మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అన్నారు. కలిసిగట్టుగా పనిచేసి అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కొందరు బీజేపీ నేతలు టెస్టు మ్యాచులు ఆడుతున్నారు.. అలాంటి వారు ఇకనైనా ఫార్మాట్ మార్చాలి.. టెస్టు మ్యాచులు వద్దని.. టీ20 మ్యాచులు ఆడుదామని చెప్పారు. రాష్ట్ర నేతలు నా సూచనలను మరోలా తీసుకోవద్దని సూచించారు.
కాగా, గతంలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు.. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ పైడి రాకేష్ రెడ్డి ట్వీట్ చేయడం అప్పుడు సంచలనంగా మారింది.






