- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీల్లో ముస్లింలను చేర్చడం కరెక్ట్ కాదు.. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ నేపథ్యంలో సర్కార్ ఆర్డినెన్స్ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. మరోవైపు బీసీల్లో ముస్లింలను చేర్చడం సరికాదని అన్నారు. బీసీ రిజర్వేషన్లు(BC Reservations) న్యాయపరంగా చిక్కుల్లో పడేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ను నియమించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది.






