వాస్తవాలు బయటపడతాయనే భయమా?.. ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వాస్తవాలు బయటపడతాయనే భయమా?.. ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న కుసిరిన అకాల వర్షం వల్ల అనేక మంది రైతులు నష్టపోయారని అన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటే.. వారి మీదకు బాంబులు తీసుకొచ్చినట్లు అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నష్టపోయిన రైతులకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోయిన బడ్జెట్‌లో ఫసల్ బీమాకు నిధులు కేటాయించి.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. శాసనసభను వేదిక చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

Next Story