అప్పటివరకు కాంగ్రెస్‌ను వదిలిపెట్టం.. పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంటంతో ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్​ఆరోపించారు.

అప్పటివరకు కాంగ్రెస్‌ను వదిలిపెట్టం.. పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంటంతో ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్​ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు పట్టిన గతే త్వరలో కాంగ్రెస్‌కూ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు మొదట తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి మాట్లాడాలని సూచించారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారని విమర్శించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి దేశ ప్రజలంతా సంతోషపడుతున్నారని, గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​నాయకులకు కేంద్ర బడ్జెట్‌పై కనీస అవగాహన లేదని, ఏ విధంగా ప్రవేశ పెడుతారో కూడా తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్​ప్రవేశ పెట్టినప్పడు జిల్లాలకు, మండలాల వారీగా ఎందుకు ప్రవేశపెట్టరని నిలదీశారు. కేంద్ర బడ్జెట్​జాతీయ స్థాయి అంశాలను పరిగణలోకి తీసుకొని సభలో ప్రవేశ పెడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం పెడితే పూర్తిగా వివరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదిలిపెట్టే ప్రసక్తిలేదని హెచ్చరించారు.

Next Story